మరోజన్మలో సెహ్వాగ్‌లా పుట్టాలి: రాహుల్ ద్రావిడ్

FILE
మరో జన్మంటూ ఉంటే టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌లా పుట్టాలని ఉందని భారత సీనియర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్ అన్నాడు. గంటలకొద్దీ బ్యాటింగ్ చేసి నిస్సత్తువగా తయారు కావడం కంటే వీరూలా తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేసేయడం ఎంతో బెటరన్నాడు. అందుకే స్వల్ప బంతులకే భారీ స్కోరు చేసే సెహ్వాగ్‌లా పుట్టాలనుకుంటున్నానని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.

అత్తగారిల్లైన నాగ్‌పూర్‌లో భారీ సెంచరీతో అదరగొట్టి, డబుల్ సెంచరీని చేజార్చుకున్న రాహుల్ ద్రావిడ్, తాను భారీ స్కోరు నమోదు చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కానీ విధ్వంసర ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ఎడాపెడా బంతులను బాదేస్తూ, భారీ స్కోరును నమోదు చేసుకుంటున్నాడని ద్రావిడ్ వెల్లడించాడు.

వెబ్దునియా పై చదవండి