మరో 7-8 నెలలు ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు: బీసీసీఐ

మంగళవారం, 3 నవంబరు 2009 (12:45 IST)
మరో ఏడు, ఎనిమిది నెలల పాటు భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండబోవని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇజాజ్ భట్‌కు స్పష్టం చేశారు. అయితే వచ్చే యేడాది పరిస్థితులు చక్కబెట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ హామీ ఇచ్చారు.

మొహాలీలో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డే సందర్భంగా ఇజాజ్ భట్, శశాంక్ మనోహర్‌లు సమావేశమై, పాక్, పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లను పునరుద్ధరించే అంశంపై చర్చించారు. ఆ సమయంలో మరో ఏడు ఎనిమిది నెలల పాటు ఇది సాధ్యపడబోదని ఆయన భట్‌కు మనోహర్ తేల్చి చెప్పారు.

ఇండో-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లపై ప్రభుత్వ అనుమతి లేనిదే ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని బీసీసీఐ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా తెలిపారు. ఇరు దేశాల మధ్య మళ్లీ క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించాలని భట్ పట్టుబడుతుండగా, మనోహర్ మాత్రం అలాంటి పరిస్థితి ఇప్పట్లో లేదన్నారు. ఎందుకంటే 7, 8 నెలలో పాటు భారత జట్టు బిజీ షెడ్యూల్ ఉందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి