మహిళా హక్కుల కోసం గళం విప్పిన సచిన్ టెండూల్కర్!

FILE
బ్యాటింగ్ విభాగంలో దాదాపు అన్ని రికార్డులను తన సొంతం చేసుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మహిళా హక్కుల కోసం ‘గళం’ విప్పనున్నాడు.

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించడానికి, వారిలో చైతన్యం తీసుకురావడానికి సినీ దర్శకుడు, నటుడు ఫరాన్ అక్తర్ నెలకొల్పిన మెన్ అగైనెస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్ (మర్ద్) సంస్థ కోసం ప్రముఖ గీత రచయిత జావెద్ అక్తర్ హిందీలో ప్రత్యేకంగా రాసిన గేయాన్ని మరాఠీ అనువాదాన్ని సచిన్ చదవనున్నాడు. మర్ద్ చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా సచిన్ గళం అందించిన ఆల్బమ్ ప్రత్యేకను సంతరించుకోనుంది.

వెబ్దునియా పై చదవండి