మహేంద్ర సింగ్ ధోనీ సేనకు గ్యారీ కిర్‌స్టెన్ కొత్త మంత్రం..!

మహేంద్ర సింగ్ ధోనీ సేనకు కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ గట్టి శిక్షణ ఇస్తున్నాడు. కఠినమైన, బౌన్సీ పిచ్‌లపై తడబాటుకు గురయ్యే అలవాటున్న భారత బ్యాట్స్‌మెన్‌కు కోచ్ కిర్‌స్టెన్ కొత్త మంత్రం ఉపదేశిస్తున్నాడు. టీమిండియా టాప్ బ్యాట్స్‌మెన్ నెట్స్‌లో ఒక్కొక్కరూ కనీసం మూడువేల సార్లు బంతిని కొట్టగలిగితే సఫారీలతో యుద్ధానికి సిద్ధమైనట్లేనని కిర్‌స్టెన్ చెబుతున్నాడు.

సఫారీలతో తొలి టెస్టు ఈ నెల 16వ తేదీన సెంచూరియన్ మైదానంలో ఆరంభం కానుండగా, తొలి విడతగా దక్షిణాఫ్రికా చేరుకున్న ఆటగాళ్లు కిర్‌స్టెన్ నేతృత్వంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా కిర్‌స్టెన్ మాట్లాడుతూ, 'ఇక్కడి పిచ్‌లకు అలవాటు పడాలంటే కొట్టిన షాట్‌నే పదేపదే కొడుతూ నెట్స్‌లో సౌకర్యవంతంగా కనిపించాలి. అప్పుడే టెస్టు సిరీస్ ఆరంభమయ్యే లోపు ప్రతి బ్యాట్స్‌మన్ కనీసం రెండు వేల నుంచి మూడు వేల బంతుల్నైనా కొట్టాలని కిర్‌స్టెన్ చెప్పాడు.

ఇకపోతే.. సొంత జట్టుతో కోచ్‌గా కిర్‌స్టెన్ టీమ్ ఇండియాను ఆడిస్తున్నాడు. దక్షిణాఫ్రికాలోని తన ట్రైనింగ్ అకాడమీలో భారత జట్టుకు కిర్‌స్టెన్ శిక్షణ ఇస్తున్నాడు. దక్షిణాఫ్రికా పిచ్‌లకు అనుగుణంగా టీమ్ ఇండియా బౌలర్లను, బ్యాట్స్‌మెన్లను రంగంలోకి దించాలని కిర్‌స్టెన్ తహతహలాడుతున్నాడు.

వెబ్దునియా పై చదవండి