మాస్టర్ సచిన్ వందో సెంచరీ సాధించలేకపోవడం విచారకరం!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వందో సెంచరీపై ఫోకస్ చేసిన మీడియా ఉల్టా అయ్యింది. సచిన్ టెండూల్కర్ వందో సెంచరీ సాధించకపోవడం విచారకరమని డెయిలీ టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది.

ఆస్ట్రేలియా మైకేల్ క్లార్క్ తొలి ట్రిపుల్ సెంచరీ సాధించడం, దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రికీ పాంటింగ్ సెంచరీ చేయడం, మైక్ హస్సీ చేసిన 150 పరుగులు దీనికి ఉదాహరణ. ఇన్ని సానుకూల అంశాలు ఒకే చోట కూడడం అనేది ఎప్పుడో కానీ జరగదు. అయినప్పటికీ సచిన్ వందో సెంచరీ సాధించలేక పోవడం నిజంగా విచారకరమేనని డెయిలీ టెలిగ్రాఫ్ పత్రిక అభిప్రాయ పడింది.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని చాలా కాలంగా ఊరిస్తున్న సచిన్ వందో సెంచరీని సాధించడానికి సిడ్నీ క్రికెట్ మైదానంలో పరిస్థితిలన్నీ చక్కగా కూడి ఉన్నాయని, అయినప్పటికీ అది జరగలేదని ఆస్ట్రేలియా మీడియా మరోసారి వాపోయింది.

వెబ్దునియా పై చదవండి