మురళీ లాంటి బౌలర్ ఇక కనిపించడేమో..!: ముస్తాక్

FILE
అంతర్జాతీయ క్రికెట్‌‌లో వచ్చే వందేళ్లలో శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ వంటి మేటి క్రికెటర్‌ను చూడలేక పోవచ్చని పాకిస్థాన్ మాజీ స్టార్ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అద్భుతమైన బౌలర్ ముత్తయ్య మురళీధరన్ అని ముస్తాక్ చెప్పుకొచ్చాడు.

అందువల్ల వచ్చే వంద సంవత్సరాల్లో ముత్తయ్య లాంటి బౌలర్‌ను చూడటం కష్టమేనని ముస్తాక్ అభిప్రాయపడ్డారు. ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్‌పై ఎవరెన్ని విమర్శలు చేసినా, తన దృష్టిలో మురళీ అత్యుత్తమ బౌలర్ అని ముష్తాక్ స్పష్టం చేశాడు.

నిజానికి అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి ముత్తయ్య రిటైర్ అవుతున్నాడంటే, ఎంతో బ్యాట్స్‌మెన్లు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుని ఉంటారని ముస్తాక్ చెప్పాడు. ఛాంపియన్ ఆఫ్-స్పిన్నర్ అయిన ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ విధానాన్ని వీడియోల్లో చూడటం ద్వారా యువ స్పిన్నర్లు చాలా నేర్చుకోవచ్చునని ముస్తాక్ చెప్పాడు.

ఇదిలావుంటే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ కాబోతున్న ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అత్యధిక వికెట్లు తీసిన రికార్డుకు పనికి రాడని ఆసీస్ మాజీ అంపైర్ రాస్ ఎమర్సన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాగే షేన్ వార్న్‌తో మురళీ రికార్డును సరిపోల్చలేమని, మురళీ గొప్ప పోరాట యోధుడైనా.. చాలాసార్లు నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేశాడని ఎమర్సన్ వ్యాఖ్యానించాడు.

వెబ్దునియా పై చదవండి