మోడీపై కీలక చర్చ: సమావేశమైన ఐపీఎల్ పాలకమండలి!

FILE
కాసుల పండించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఛైర్మన్ లలిత్ మోడీ వ్యవహారంపై కీలక చర్చలు జరిపేందుకు సోమవారం ఐపీఎల్ పాలకమండలి సమావేశం ఏర్పాటైంది.

ఐపీఎల్-3 ఫైనల్ సందర్భంగా లలిత్ మోడీని ఛైర్మన్ పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన నేపథ్యంలో.. మోడీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం భేటీ అయ్యింది.

ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, ఐపీఎల్ గవర్నరింగ్ కౌన్సిల్ ఉన్నతాధికారులు, కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి, ఐసీసీ కాబోయే అధ్యక్షుడు శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు.

ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఐపీఎల్ క్రికెట్లో అవకతవకలకు పాల్పడిన లలిత్ మోడీపై వేటు వేయాలని బీసీసీఐ సంసిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మోడీ ఐపీఎల్ పాలకమండలి సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినా లెక్కచేయని బీసీసీఐ, ముందుగా ప్రకటించినట్లే ఐపీఎల్ పాలకమండలి సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేసింది. దీంతో పాటు ఈ గవర్నింగ్ కౌన్సిల్‌లో హాజరయ్యేందుకు ముందే లలిత్ మోడీని ఆ పదవి నుంచి తొలగించింది.

వెబ్దునియా పై చదవండి