యాషెస్ రెండో టెస్ట్: బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్

లార్డ్స్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఆండ్ర్యూ స్ట్రాస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కార్డిఫ్‌లో జరిగిన సిరీస్ తొలి మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ సంప్రదాయ సమరాన్ని ఇరుదేశాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి.

లార్డ్స్‌లో ఘనమైన చరిత్ర కలిగిన ఆస్ట్రేలియాను మట్టికరిపించేందుకు ఇంగ్లండ్ ప్రతిసారీ శాయశక్తులా పోరాడుతూనే ఉంది. అయితే 1934 నుంచి ఆస్ట్రేలియా ఈ మైదానంలో ఓటమి అంటే తెలియనట్లు ఆడింది. తాజా యాషెస్ సిరీస్‌లోనూ దీనిని కొనసాగిస్తామని ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ధీమాగా చెప్పాడు.

జట్లు:
ఆస్ట్రేలియా: ఫిల్ హుగెస్, సిమన్ కటిచ్, రికీ పాంటింగ్ (కెప్టెన్), మైక్ హసీ, మైకెల్ క్లార్క్, మార్కస్ నార్త్, బ్రాడ్ హాడిన్, మిచెల్ జాన్సన్, నాథన్ హారిట్జ్, బెన్ హిల్ఫెన్హాస్, పీటర్ సిడిల్
ఇంగ్లండ్: ఆండ్ర్యూ స్ట్రాస్ (కెప్టెన్), ఆలస్టిర్ కుక్, రవి బొపారా, కెవిన్ పీటర్సన్, పాల్ కాలింగ్‌వుడ్, మాట్ ప్రియర్, ఆండ్ర్యూ ఫ్లింటాఫ్, స్టువర్ట్ బ్రాడ్, గ్రేమే స్వాన్, జేమ్స్ ఆండర్సన్, గ్రాహం ఆనియన్స్

వెబ్దునియా పై చదవండి