రాయల్ ఛాలెంజర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ గెలిచినా..!?

రాజస్థాన్ రాయల్స్‌కు బుధవారం విషమ పరీక్ష ఎదుర్కోనుంది. వరుసగా రెండు ఓటములతో ప్లే ఆఫ్ ఆశలు అడుగంటుతున్న తరుణంలో రేపు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్‌ని ఢీకొనపోతుంది. ఇక ముందు జరిగే ప్రతి మ్యాచ్‌ చావోరేవో అయిన రాజస్థాన్‌కు సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడుతున్న క్రిస్ గేల్‌ను ఎదుర్కోవటమే పెద్ద పరీక్ష.

రాజస్థాన్, బెంగళూర్ జట్లకు ఇంకా ప్లే ఆఫ్‌లో స్థానం ఖరారు కాలేదు. అయితే రాజస్థాన్‌తో పోలిస్తే బెంగళూర్ కొంత మెరుగైన స్థితిలో ఉంది. సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా రాజస్థాన్ ఓటమి పాలయ్యింది. వెస్టిండీస్‌కు చెందిన గేల్ దూకుడు బ్యాటింగ్‌తో బెంగళూర్ జట్టు ఐదు విజయాలను సొంతం చేసుకుంది. గేల్ తన భీకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి