లంక క్రికెటర్లపై దాడి కేసు: నిందితునికి బెయిల్ మంజూరు!

ఆదివారం, 9 అక్టోబరు 2011 (11:49 IST)
గత 2009 సంవత్సరంలో లాహోర్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు బస్సుపై జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించిన నిందితుడిని పాకిస్థాన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మొహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తిని కీలక నిందితునిగా భావిస్తున్నారు. ఈ నిందితునికి పాకిస్థాన్ తీవ్రవాద వ్యతిరేక కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది.

లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితునికి పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసిందని, అందువల్ల తనకూ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఇబ్రహీం తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.

ప్రాసిక్యూషన్ మాత్రం బస్సుపై ఏకే-47 రైఫిల్స్, రాకెట్స్, గ్రెనైడ్స్‌‌లతో దాడిచేసిన ఘటనలో ఇబ్రహీంతో సహా వాహబ్ అలియాస్ ఉమర్ ద్రాడ్, మహ్మద్ జుబైర్, నాయక్ మొహ్మద్, మాలిక్ ఇషాక్, మొహ్మద్ మోషిన్, మొహ్మద్ ఆష్పాక్‌లకు సంబంధం ఉన్నట్టు కోర్టుకు అందువల్ల బెయిల్ మంజూరు చేయరాదని కోరింది. అయితే, ఇబ్రహీంకు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ మేరకు బెయిల్ మంజూరు చేసింది.

వెబ్దునియా పై చదవండి