వన్డే సిరీస్: లంక బయలుదేరిన టీం ఇండియా

శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం టీం ఇండియా బయలుదేరి వెళ్లింది. ఈ సిరీస్‌ను గెలుచుకునే సత్తా టీం ఇండియాకు ఉందని ఈ సందర్భంగా జట్టు కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తెలిపారు. ప్రపంచంలో నెంబర్‌వన్ జట్టు అయ్యేందుకు టీం ఇండియా సరైన మార్గంలో ముందుకెళుతుందని చెప్పారు.

బుధవారం కిర్‌‍స్టెన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జట్టులోని ఆటగాళ్లందరూ సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, ఇంగ్లండ్‌లో ట్వంటీ- 20 ప్రపంచకప్ వైఫల్యం ఎవరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదని ఉద్ఘాటించారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో శ్రీలంక వెళుతున్నాము. ఇటీవల లభించిన విశ్రాంతి ఆటగాళ్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. విశ్రాంతి లభించడం మంచిదే.

ముఖ్యంగా చాలా క్రికెట్ ఆడిన తరువాత విశ్రాంతి ఎంతో అవసరం. వచ్చే నెలల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ఈ విశ్రాంతి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా ముగిసిన కార్పొరేట్ కప్‌తో ఆటగాళ్లకు అవసరమైన ప్రాక్టీసు కూడా లభించిందన్నారు.

వెబ్దునియా పై చదవండి