వెస్టిండీస్ టూర్‌లో రాణించిన ధోనీ, నెహ్రా

వెస్టిండీస్‌లో జరిగిన నాలుగు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ భారతీయ ఆటగాళ్లే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఈ సిరీస్ టాప్ స్కోరర్‌గా టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిలువగా, సిరీస్‌లో అత్యుధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గానూ టీం ఇండియా సభ్యుడే ఉన్నాడు.

నాలుగేళ్ల తరువాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చిన పేస్‌బౌలర్ ఆశిష్ నెహ్రా తన పునరాగమనాన్ని బలంగా చాటుకున్నాడు. తాజా సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌ను కూడా టీం ఇండియా 2-1తో భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో 91 సగటుతో 182 పరుగులు సాధించిన ధోనీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు.

ఇదిలా ఉంటే నెహ్రా 7.84 ఎకనమీ రేటుతో ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే వెస్టిండీస్ బౌలర్ డ్వానే బ్రావో కూడా ఆరు వికెట్లు పడగొట్టి నెహ్రాతో అగ్రస్థానాన్ని పంచుకుంటున్నాడు. వెస్టిండీస్ యువ బౌలర్ రవి రామ్‌పాల్, భారత ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్, విండీస్ బౌలర్ జెరోమే టేలర్ తలా నాలుగు వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి