శృంగారం ఫీల్డింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది: కోచ్

టీం ఇండియా క్రికెటర్ల ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగుపడేందుకు జట్టు కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ఆసక్తికర సలహా ఇచ్చాడు. ఫీల్డింగ్ ప్రదర్శన మెరుగుపడాలంటే శృంగార జీవితాన్ని పెంచుకోవాలని కిర్‌స్టెన్ భారత క్రికెటర్లకు సూచించాడు. మంచి శృంగార జీవితం ఫీల్డింగ్ ప్రమాణాలు పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పాడు.

కోచ్ గ్యారీ కిర్‌స్టెన్, మానసిక నిపుణుడు పాడీ ఉప్తోన్ టీం ఇండియా ఆటగాళ్లకు పంచిపెట్టిన రహస్య పత్రాల్లో శృంగార జీవితంపై దృష్టి సారించడం వలన చేకూరే ప్రయోజనాలను వివరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే టీం ఇండియా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో తన తొలి మ్యాచ్‌లో శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొనబోతుంది.

వెబ్దునియా పై చదవండి