సచిన్ అవుట్‌పైనే బౌలర్లు దృష్టి సారించడం సరికాదు!: స్టెయిన్

బుధవారం, 5 జనవరి 2011 (16:14 IST)
FILE
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేయడంపైనే బౌలర్లు దృష్టి సారించడం సరికాదని దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ అన్నాడు. కేప్‌టౌన్ టెస్టు మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన స్టెయిన్, సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేయడం పైనే బౌలర్లు దృష్టి పెట్టకుండా, మిగిలిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ల వికెట్లు పడగొట్టడానికి కూడా ప్రయత్నించాలని స్టెయిన్ అన్నాడు.

కేప్‌టౌన్‌లో మూడో టెస్టు మూడో రోజు ఆటలో కొత్త బంతిని తీసుకున్న సమయంలో అద్భుత స్పిన్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్లను హడలెత్తింపజేసిన స్టెయిన్, అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సచిన్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. సచిన్‌కు బంతులేసి ఆతనిని అవుట్ చేయడంపైనే దృష్టి పెట్టే బౌలర్లు, మిగిలిన బ్యాట్స్‌మెన్లను అవుట్ చేయడంపై కూడా దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించాడు.

ఓ బౌలర్ తన సూపర్ బంతిని సచిన్‌కు విసిరినా, 11వ స్థాయి బ్యాట్స్‌మెన్‌కు బంతి విసిరినా ఒకటేనని అన్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన స్టెయిన్, రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు స్వల్ప పరుగులకే కట్టడి చేసే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి