స్థానిక క్రికెట్ టోర్నీలకు షాహిద్ అఫ్రిది దూరం

దక్షిణాఫ్రికాలో త్వరలో ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. పాకిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది స్థానిక క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. తాను ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీపైనే దృష్టిసారించానని ఆ జట్టు వైస్ కెప్టెన్ చెప్పాడు. దీని కోసం ముమ్మర సాధన చేస్తున్నానన్నాడు.

స్థానిక క్రికెట్ టోర్నమెంట్‌లు ఆడటం మంచిదే. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎటువంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ఇప్పటికే గాయంతో బాధపడుతున్న అఫ్రిది దేశవాళీ ట్వంటీ- 20 మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. లాహోర్‌లో జరుగుతున్న జట్టు శిక్షణా శిబిరంలో సాధన చేస్తూ అఫ్రిది గాయపడ్డాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్రయోగాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని అఫ్రిది చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి