స్పాన్సర్ల కొరతతో.. సహారా కాంట్రాక్టు కొనసాగింపు!

FILE
భారత క్రికెట్ జట్టుకు స్పాన్లర్ల కొరత ఏర్పడటంతో "సహారా" కాంట్రాక్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆరు నెలలపాటు కొనసాగించింది. ఈ మేరకు సహారా స్పాన్సర్ ఒప్పందాన్ని ఆరు నెలల పాటు కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ ఓ ఒప్పందం కుదుర్చుకుంది.

బీసీసీఐ అధ్యక్షుడు శషాంక్ మనోహర్ నేతృత్వంలో సహారా మార్కెటింగ్ బృందంతో జరిగిన సమావేశం అనంతరం ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి శ్రీనివాసన్ ప్రకటించారు. ఈ సహారా స్పాన్సర్ ఒప్పందం ఆరు నెలల కాలం కొనసాగుతుందని, ఈ లోపు స్పాన్సర్లు లభించిన పక్షంలో నూతన ఒప్పందానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తామని శ్రీనివాస్ అన్నారు.

ఇదిలా ఉంటే.. భారత్-శ్రీలంకల మధ్య జరిగే రెండు టీ-20 అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు కావాల్సిన మైదానాలు వంటి తదితర సదుపాయాల కోసం వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ సంస్థకు బీసీసీఐ రూ. 315 కోట్లను కేటాయించింది.

వెబ్దునియా పై చదవండి