స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇంగ్లండ్ రె "ఢీ": స్వాన్

గురువారం, 8 నవంబరు 2012 (17:30 IST)
FILE
స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇంగ్లండ్ రెడీగా ఉందని ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ధీమా వ్యక్తం చేశాడు. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తమ బ్యాట్స్‌మెన్లు పరిణతి చెందారని స్వాన్ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే సిరీస్‌ను సమం చేశామని స్వాన్ గుర్తు చేశాడు.

స్పిన్ బౌలింగ్ ద్వారా ఇంగ్లండ్‌ను సులభంగా ఓడించవచ్చుననే ఉద్దేశంతోనే బీసీసీఐ భారత జట్టులో అశ్విన్, భజ్జీ, ఓజాలకు స్థానం కల్పించింది. గత పదేళ్లుగా ఆసియా గడ్డపై బంగ్లాదేశ్ సిరీస్ మినహా ఇంగ్లండ్ ఇప్పటి వరకు 22 టెస్టులాడి రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్పిన్ బౌలర్ స్వాన్ స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్‌‌తో దుబాయ్‌లో జరిగిన టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ 0-3 తేడాతో ఓడిపోవడానికి పిచ్ కారణం. కానీ భారత పిచ్ సక్రమంగా ఉంటుందని, తద్వారా భారత జట్టుపై గెలవడం సాధ్యమని స్వాన్ వ్యాఖ్యానించాడు.

వెబ్దునియా పై చదవండి