2011 ప్రపంచ కప్ ఫేవరేట్ టీమ్ ఇండియానే: కపిల్ దేవ్

శుక్రవారం, 10 డిశెంబరు 2010 (11:26 IST)
వచ్చే యేడాది ఫిబ్రవరిలో భారత ఉపఖండంలో జరుగనున్న ఐసీసీ ప్రపంచ కప్‌‌లో టైటిల్ ఫేవరేట్‌గా భారత్ బరిలో ఉంటుందని భారత క్రికెట్ లెజండ్, హర్యానా హరికేన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.

ఈ టోర్నీలో భారత జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడం అనేది తొలి పరీక్షగా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు జరిగే ప్రతి మ్యాచ్‌ను ఇదే స్ఫూర్తితో భారత జట్టు అదేస్ఫూర్తితో ఆడితే కప్ మనదేనని విశ్వాసం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా, కప్‌ను సొంతం చేసుకోవాలంటే ఒకటి రెండు మ్యాచ్‌లు ఆడితో సరిపోదన్నారు.

టోర్నమెంట్ జరిగే నెల రోజులూ బాగా ఆడాలి. అయితే టోర్నమెంట్‌కు ముందు భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించడం జట్టుకు ఎంతో ఉపయోగిస్తుందన్నారు. 1983లో ప్రపంచ కప్‌ను గెలుచుకోవడానికి ముందు తాము వెస్టిండీస్‌లో కఠినమైన క్రికెట్‌ను ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. అలాగే ఇప్పుడు కూడా భారత జట్టు దక్షిణాఫ్రికాలో రాణిస్తే అది వారి విశ్వాసాన్ని ఎంతో పెంచుతుందని చెపుతున్నాడు.

వెబ్దునియా పై చదవండి