మరో చెత్త రికార్డుకు చేరువైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ!

సోమవారం, 11 ఆగస్టు 2014 (14:37 IST)
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో చెత్త రికార్డుకు చేరువయ్యాడు. అంతర్జాతీయంగా అతి ఎక్కువ టెస్టు మ్యాచులు ఓడిన కెప్టెన్ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీకి త్వరలోనే చోటు దక్కనుంది. 
 
ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచులో ఓటమితో కెప్టెన్ ధోనీ ఖాతాలో ఇప్పటికే 13 టెస్ట్ ఓటములు నమోదయ్యాయి. మరో మూడు ఓటములు మూటగట్టుకుంటే ధోనీ తన పేరున ఓ చెత్త రికార్డును లిఖించుకునే అవకాశం దక్కనుంది. 
 
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియన్ లారా పేరిట ఉన్న 16 టెస్ట్ ఓటముల రికార్డుకు ధోనీ కేవలం మరో మూడు టెస్టుల దూరంలోనే ఉన్నాడు.
 
భారత్ తరపున మన్సూర్ అలీఖాన్ పటౌడీ, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ 10 టెస్ట్ ఓటములతో రెండో స్థానంలో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి