బ్రిస్బేన్ వన్డే : భారత్ 153 ఆలౌట్.. ఇంగ్లండ్ టార్గెట్ 154 రన్స్

మంగళవారం, 20 జనవరి 2015 (11:56 IST)
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా మంగళవారం బ్రిస్బేన్‌ క్రికెట్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ 153 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తన ప్రత్యర్థి ముంగిట 154 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, ఫిన్‌లు భారత నడ్డివిరిచారు. వీరిద్దరు కలిసి తొమ్మిది వికెట్లు తీయగా, అలీ ఒక వికెట్ తీశాడు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత బ్యాట్స్‌మెన్లు సమిష్టిగా విఫలం కావడంతో భారత్ కేవలం 39.3 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌట్ అయ్యారు. భారత బ్యాట్స్‌మెన్లలో రెహానే 33, ధవాన్ 1, రాయుడు 23, విరాట్ కోహ్లీ 4, సురేష్ రైనా 1, ధోనీ 34, స్టువర్ట్ బిన్నీ 44, ఏఆర్ పటేల్ 0, భువనేశ్వర్ కుమార్ 5, షమీ 1 చొప్పున పరుగులు చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో మరో ఏడు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ 150 పరుగులైనా చేయగలిగింది. 

వెబ్దునియా పై చదవండి