వరల్డ్ కప్ ఆశలన్నీ కోహ్లీ చుట్టే..!: రాహుల్ ద్రవిడ్

శనివారం, 24 జనవరి 2015 (17:07 IST)
టీమిండియా ప్రపంచకప్ ఆశలన్నీ స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ చుట్టే అల్లుకున్నాయని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదా నిలబెట్టుకోవాలంటే కోహ్లీ రాణించడం ఎంతో అవసరం అని స్పష్టం చేశారు. టీమిండియా వరల్డ్ కప్ ఆశలపై ఆయన విశ్లేషిస్తూ, ప్రస్తుతం టీమిండియా విరాట్‌పై ఆధారపడినట్టు కనబడుతోందన్నారు. 
 
అంచనాలకు తగ్గట్టు విరాట్ రాణిస్తే భారత్ లాభపడుతుందని రాహుల్ ద్రవిడ్ చెప్పారు. విరాట్ కోహ్లీతో పాటు సురేష్ రైనా, కెప్టెన్ ధోనీ రాణించాల్సిన అవసరం ఉందని ద్రవిడ్ పేర్కొన్నారు. 
 
భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ గమనిస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుందని, బౌలర్లు ఎంతో మెరుగుపడాల్సి ఉందని తెలిపారు. బౌలింగ్‌తో పాటు జట్టు లోపాలను సరిదిద్దుకుని వరల్డ్ కప్‌లో రాణించాల్సి ఉందని రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి