బ్యాట్‌ల సెలెక్షన్‌లో టీమిండియా కెప్టెన్ ధోని బిజీబిజీ

బుధవారం, 19 నవంబరు 2014 (14:43 IST)
ఆస్ట్రేలియా సిరీస్ కోసం మీరట్‌లో బ్యాటుల సెలెక్షన్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బిజీబిజీగా ఉన్నారు. గాయం కారణంగా జట్టుకు దూరమైన ధోని ఆస్ట్రేలియా సిరీస్‌కు సిద్ధమవుతున్నారు. 
 
1260 గ్రాముల బరువుండే ఆరు బ్యాటులను ధోని ఎంపిక చేసుకున్నాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బ్యాటు ఆకారంతో పాటు స్ట్రోక్ పరిగణనలోకి తీసుకుని బ్యాటులు సెలెక్ట్ చేసుకున్నాడని తెలిపాయి. ఆడిలైడ్ లో డిసెంబర్ 12 నుంచి జరిగే రెండో టెస్టులో ధోని ఆడనున్నాడు.

వెబ్దునియా పై చదవండి