ధోనీకి పద్మభూషణ్, కోహ్లీకి పద్మశ్రీ అవార్డు!

గురువారం, 14 ఆగస్టు 2014 (17:29 IST)
భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీకి పద్మభూషణ్, యువ ఆటగాడు విరాట్ కోహ్లీకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కేంద్రానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రతిపాదించింది. మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, హైదరాబాదీ మిథాలీ రాజ్ పేరును కూడా పద్మశ్రీకి నామినేట్ చేసింది.
 
ధోనీకి 2009లో పద్మశ్రీ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఒక వేళ ధోనీకి పద్మభూషణ్ అవార్డును ప్రకటిస్తే.. ఈ అవార్డు అందుకున్న క్రికెటర్లలో ధోనీ పదో ఆటగాడు అవుతాడు. ధోనీ సారథ్యంలో భారత జట్టు ప్రపంచ ట్వంటి20, ప్రపంచ వన్డే ఛాంపియన్‌‌‌గా నిలిచిన విషయం తెలిసిందే.
 
కాగా, 25 ఏళ్ల విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్లో రాణించకపోయినా.. 134 వన్డే ఇంటర్నేషనల్స్‌లో 5,634 పరుగులు సాధించడం, 25 అంతర్జాతీయ సెంచరీలను నమోదు చేయడం ద్వారా అత్యుత్తమ బ్యాటింగ్ ప్రతిభతో పద్మశ్రీ అవార్డుకు నామినేట్ అయ్యాడు. 

వెబ్దునియా పై చదవండి