బీసీసీఐ ప్రెసిడెంట్‌గా నన్ను నియమించండి : ఎన్. శ్రీనివాసన్

శుక్రవారం, 21 నవంబరు 2014 (20:14 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా తనను తిరిగి నియమించాలంటూ ఐసీసీ చీఫ్ ఎన్. శ్రీనివాసన్ సుప్రీంకోర్టును కోరారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించి తానెలాంటి తప్పు చేయలేదని, ఆ విషయంలో తన పాత్రేమి లేదని ముద్గల్ కమిటీ నివేదికలో పేర్కొందని, ఈ నివేదికను కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లోనూ పేర్కొందని గుర్తు చేశారు. 
 
ముద్గల్ కమిటీ దర్యాప్తు జరుగుతున్న సమయంలో అధ్యక్ష పదవి నుంచి తాను స్వచ్ఛందంగా వైదొలిగానని శ్రీని కోర్టుకు వివరించారు. కాబట్టి, మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు అనుమతి తెలపాలని సుప్రీం కోర్టుకు విన్నవించుకున్నారు. 
 
మరోవైపు శ్రీనివాసన్‌కు మద్దతు తెలుపుతూ బీసీసీఐ కూడా ఈ రోజు ఓ అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించింది. ఓ ఆటగాడు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు శ్రీనితో పాటు మరో నలుగురు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ముద్గల్ కమిటీ అనడం సరైంది కాదని బీసీసీఐ అభిప్రాయపడింది. ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీం ఈ నెల 24కు వాయిదా వేసింది. 

వెబ్దునియా పై చదవండి