బ్రాడ్‌మెన్ నుంచి లభించిన ప్రశంసే నాకు గొప్పది : సచిన్

శుక్రవారం, 5 సెప్టెంబరు 2014 (09:27 IST)
‘నా బ్యాటింగ్‌ శైలి తన బ్యాటింగ్‌ శైలిని పోలి ఉంటుందని బ్రాడ్‌మన్‌ అతని భార్యతో చెప్పాడు. బ్రాడ్‌మన్‌ నుంచి లభించిన గొప్ప ప్రశంస ఇదేన’ని భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ చెప్పుకొచ్చాడు. క్రికెట్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ తీసిన ఆల్‌టైమ్‌ టెస్ట్‌ లెవెన్‌ జట్టు ఫొటోను తాను పదిలంగా దాచుకున్నట్టు ఈ భారత క్రికెట్‌ లెజెండ్‌ తెలిపాడు. ఆస్ట్రేలియన్ కాన్సులేట్‌ ఆధ్వర్యంలో గురువారమిక్కడ జరిగిన సమావేశంలో ఆసీస్‌ ప్రధాని టోనీ అబాట్‌, మాజీ క్రికెటర్లు గిల్‌క్రిస్ట్‌, బ్రెట్‌లీతో కలిసి పాల్గొన్న సచిన్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 
 
ముఖ్యంగా బ్రాడ్‌మన్ రూపొందించిన ‘పదకొండు మంది ఆల్ టైమ్ టెస్ట్ క్రికెటర్ల జాబితాలో తన ఫోటో ఉండటం గొప్ప అదృష్టమని’ సచిన్ తెలిపారు. ‘‘కొన్ని సందర్భాలలో నా బ్యాటింగ్ శైలి బ్రాడ్‌మన్ శైలిని పోలి ఉంటుందని ఆయన భార్య చెప్పారు. అది నాకు మరింత సంతోషాన్ని కలిగించింది. నేను జీవితంలో అందుకున్న అతి పెద్ద అభినందన బ్రాడ్‌మన్ ఇచ్చిందే’’ అని సచిన్ ముసిముసి నవ్వులతో చెప్పాడు. 

వెబ్దునియా పై చదవండి