టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ చాలా కాలం తర్వాత తన వైవాహిక జీవితంపై పెదవి విప్పాడు. సానియాతో పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాత వారి మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయంటూ భారత్, పాక్ మీడియాలు కోడై కూశాయి.
అదేవిధంగా పాక్ నటి హుమైమాతో కలిపి వస్తున్న వార్తలపై షోయబ్ మాట్లాడుతూ సానియా తన భార్య కాగా, హుమైమా తనకు ఒక మంచి స్నేహితురాలని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా వచ్చే ప్రపంచ కప్ కు ఆడతారా?అన్న ప్రశ్నకు సమాధానం షోయబ్ దాటవేశాడు.