స్పాట్ ఫిక్సింగ్: ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్‌తో సహా ఏడుగురి పేర్లు.. సుప్రీం వెల్లడి

శుక్రవారం, 14 నవంబరు 2014 (19:34 IST)
భారత్ క్రికెట్‌ను ఒక కుదుపు కుదుపిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్‌‌ కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ కేసును విచారించిన ముద్గల్ కమిటీ నివేదికలో 13 పేర్లకు గాను ఏడు పేర్లను సుప్రీం కోర్టు వెల్లడించింది.
 
భారత క్రికెట్ రంగాన్ని ఓ కుదుపు కుదిపిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో పాత్ర ఉన్న ఏడుగురి పేర్లను సుప్రీంకోర్టు శుక్రవారం బహిర్గతం చేసింది. ఈ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై జస్టీస్ ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకుని ఈ పేర్లను వెల్లడించింది. 
 
ఈ నివేదికలో మొత్తం 13 మంది పేర్లు ఉండగా, వారిలో ఏడుగురు పేర్లను వెల్లడించింది. ఇందులో ఇందులో ఐసీసీ చీఫ్ ఎన్ శ్రీనివాసన్, ఆయన అల్లుడు గురునాథ్ మెయప్పన్, క్రికెటర్లు స్టువర్ట్ బిన్నీ(భారత్), ఓవైషా (ఇంగ్లాండ్), శామ్యూల్ బాడ్రీ (వెస్టిండిస్), బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా, మాజీ ఐపీఎల్ ఆఫీసర్ సుందర్ రామన్‌ పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత స్పాట్ ఫిక్సింగ్ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 24కు తేదీకి వాయిదా వేసింది. 

వెబ్దునియా పై చదవండి