కొచ్చి, పూణే బిడ్స్‌పై ఎలాంటి అనుమానం లేదు: బీసీసీఐ

PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవహారంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రక్షాళన చర్యలు చేపట్టింది. పూణే, కొచ్చి ఫ్రాంచైజీల వ్యవహారంలో ఆర్థిక అవకతవలున్నాయని ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ ఆరోపించిన నేపథ్యంలో.. బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కొచ్చి, పూణే ఫ్రాంచైజీలకు క్లీన్ చిట్ ఇచ్చారు.

కొచ్చి ఫ్రాంచైజీని 333 మిలియన్లకు రెండెజ్వస్ స్పోర్ట్స్ వరల్డ్ సొంతం చేసుకుందని, ఇందులో ఎలాంటి అవకతవకలకు చోటు లేదని శశాంక్ మనోహర్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పత్రాలు, డాక్యుమెంట్లు సరిగ్గానే ఉన్నాయని మనోహర్ అన్నారు.

అలాగే స్వెట్ ఈక్విటీ (ఉచిత వాటా) ఇవ్వాలా? వద్దా? అనేది ఫ్రాంచైజీల నిర్ణయమని శశాంక్ మనోహర్ తెలిపారు. ఈ రెండు జట్ల విషయంలో అవకతవకలు జరగలేదు. ఇంకా లలిత్ మోడీ ఆరోపణల్లో నిజం లేదని బీసీసీఐ అధ్యక్షుడు స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి