ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న డే అండ్ నైట్ రెండో వన్డే మ్యాచ్‌లో భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన సెహ్వాగ్ తుది జట్టులో చోటు సంపాదించాడు. రోహిత్, మునాఫ్ స్థానాలలో సెహ్వాగ్, ప్రవీణ్ కుమార్‌లకు చోటు కల్పించారు.
సెహ్వాగ్ తిరిగీ జట్టులోకి రావడంతో భారత బ్యాటింగ్ లైనఫ్ మరింత పటిష్టంగా ఉందనే చెప్పవచ్చు. అయితే ప్రేసదాస స్టేడియం రికార్డుల పరంగా స్పిన్నర్లకే అనుకూలిస్తుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఏ కోణంలో చూసినా భారత్ పరిస్థితి మెరుగ్గా కనిపిస్తున్నా, స్థానిక అభిమానుల మద్దతు లంక జట్టుకు కలిసొచ్చే విషయంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో భారత్-లంకల మధ్య హోరాహోరి పోరు తప్పదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జట్ల వివరాలు :
భారత జట్టు : ధోనీ(కెప్టెన్), సచిన్, సెహ్వాగ్, గంభీర్, సురేశ్ రైనా, యువరాజ్, యూసుఫ్ పఠాన్, ప్రవీణ్‌కుమార్, ప్రజ్ఞాన్ ఓజా, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ.
శ్రీలంక జట్టు : జయవర్ధనె(కెప్టెన్), దిల్షాన్, జయసూర్య, సంగక్కర, కాదంబి, కపుగెడెర, తుషారా, మహరూఫ్, కులశేఖర, మురళీధరన్, మెండీస్.