సెహ్వాగ్‌ రనౌట్ : భారత్‌ 126/3

శనివారం, 31 జనవరి 2009 (16:07 IST)
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నన టీం ఇండియా తొలి 20.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన డాషింగ్ ఓపెనర్ 26 బంతుల్లో 42 పరుగులు చేసి, రనౌట్‌తో పెవిలియన్ బాట పట్టాడు.

మరో ఓపెనర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కేవలం ఆరు పరుగులు చేసి కులశేఖర బౌలింగ్‌లో ఎల్బీ‌డబ్ల్యూతో వెనుదిరిగి, అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. అంతకు ముందుగానే గౌతం గంభీర్‌ 28 బంతుల్లో 27 పరుగులు చేసి మహరూఫ్ బౌలింగ్‌లో సంగక్కరకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ప్రస్తుతం యువరాజ్‌సింగ్‌ (37), సురేశ్‌రైనా (9) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. లంక బౌలర్లలో కులశేఖర, మహరూఫ్‌లు చెరో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే... దంబుల్లా వన్డేలో కేవలం ఐదు పరుగులకే... తుషార బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టిన సచిన్, రెండో వన్డేలో కూడా ఏడుపరుగులకే ఎల్బీ‌డబ్ల్యూగా వెనుదిరగటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి