1983 నాటి అద్భుతం. క్రికెట్ లెజండ్ కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్ గెలుచుకున్న సమయం. అలాంటి అద్భుతం ధోనీ కెప్టెన్సీలో, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కల సాకారమయ్యేందుకు వేదిక సిద్ధమైంది.
భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్త ఆతిథ్యంలో 10 రోజుల్లో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్, 1983నాటి కపిల్ డెవిల్స్ అద్భుతం పునరావృతమవుతుందానని యావత్తు క్రికెట్ ప్రపంచం ఆత్రుతతో ఎదురుచూస్తుంది.
28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణను టీమిండియా ఫలింపజేసేందుకు "సై" అంటున్న వేళ మళ్లీ అలాంటి ఘట్టం పునరావృతమవుతుందా.. సచిన్ తన కెరీర్లో వన్డే ప్రపంచకప్ సాధిస్తుందా అని దేశ ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుత టీమిండియాకు వన్డే ప్రపంచకప్ గెలిచే సామర్థ్యముందని అటు క్రికెట్ లెజండ్లు, టీమిండియా సభ్యులు సైతం ధీమా వ్యక్తం చేస్తుంటే.. క్రీడా విశ్లేషకులు మాత్రం అతివిశ్వాసం వద్దంటూ, ఒత్తిడికి లోనవకుండా మైదానంలో రాణిస్తే.. తప్పకుండా వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకోవడం సులభమవుతుందంటున్నారు.
అయితే పదిహేను మంది సభ్యుల టీమిండియా జట్టులో వికెట్ కీపర్ ధోనీ, ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్లతో పాటు ఆరుగురు బ్యాటింగ్ వీరులు, నలుగురు బౌలర్లు, ఇంకో ముగ్గురు స్పిన్ బౌలర్లు తప్పకుండా వన్డే ప్రపంచకప్‌ను సాధించి పెడుతారని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.
కానీ 1983 తర్వాత ప్రపంచకప్ వేదికలపై భారత్ భంగపడుతోంది. 1987, 1996 సంవత్సరాల్లో మహేంద్ర సింగ్ ధోనీ సేన సెమీఫైనల్ దశలో ఇంటి ముఖం పట్టింది. 1999లో సూపర్ సిక్స్ దశలోనే పోరాటం చాలించింది. 1992నాటి మొదటి అంచె పరాభవం 2007లోనూ పునరావృతమైంది.
1983నాటి భారత జట్టులో గవాస్కర్, కపిల్‌దేవ్ మినహా సూపర్ స్టార్లు ఎవరూ లేకపోయినా, కలిసికట్టుగా కదం తొక్కడమే సత్ఫలితాలనిచ్చింది. ఇదే తరహాలో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ప్రస్తుత మహేంద్ర సింగ్ ధోనీ సమిష్టిగా కృషి చేస్తే 2011లో భారత్ వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
అలాగే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనదైన శైలిలో బ్యాటింగ్‌లో వీరవిహారం చేస్తే అతని కెరీర్లో వరల్డ్ కప్ రికార్డు సైతం చేరుతుంది. ఇప్పటిదాకా ఆరు ప్రపంచకప్ పోటీల్లో ఆడిన రికార్డు, పాకిస్థాన్ దిగ్గజాల్లో ఒకరైన జావేద్ మియాందాద్ సొంతం. ఆ ఘనతను చేజిక్కించుకుని సమఉజ్జీవిగా నిలిచే అవకాశం నేడు సచిన్ టెండూల్కర్ ముంగిట నిలిచింది.
FILE
పలు రికార్డులతో అదరగొడుతున్న సచిన్ టెండూల్కర్, తన ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. క్లైవ్ లాయ్డ్, రికీ పాంటింగ్, రిచర్డ్స్, అరవింద డిసిల్వా, గిల్‌క్రిస్ట్ వీరంతా ప్రపంచ కప్ తుదిపోరులో శతకం నమోదు చేసిన క్రికెటర్లు.
ఆ జాబితాలో తన పేరు ఉండి తీరాలన్న పట్టుదలతో సచిన్ చెలరేగాలని, మాస్టర్‌కు చేదోడుగా, సెహ్వాగ్, గంభీర్, కోహ్లీ, పఠాన్ విజృంభిస్తే వన్డే ప్రపంచకప్ మనదే. అలాగే బౌలర్లు సైతం మైదానంలో ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ సత్తా ఏంటో నిరూపించుకుంటే, సచిన్ కల సాకారమవుతుంది.