మొహాలీలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పటిష్ట స్థితిలో ఉంది. అయితే.. ఇంగ్లీష్ బౌలర్లు ఎట్టకేలకు ఓపెనర్ గంభీర్-రాహుల్ ద్రావిడ్ రికార్డు భాగస్వామ్యానికి తెరదించారు. ఇంగ్లండ్ స్పిన్ బౌలర్ స్వాన్ గంభీర్ వికెట్‌ను దక్కించుకున్నాడు. మంచి ఊపుమీద ఉన్న గంభీర్ స్వాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ప్రయర్‌కు క్యాచ్ ఇచ్చి 179 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు.
ద్రావిడ్‌తో కలిసి గంభీర్.. 314 పరుగులు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరోవైపు.. తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో సెంచరీ చేసిన రాహుల్ ద్రావిడ్ 136 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్-వీవీఎస్.లక్ష్మణ్‌లు క్రీజ్‌లో కొనసాగుతున్నారు. భారత్ తన మూడో వికెట్‌ను 329 పరుగుల వద్ద కోల్పోయింది.