రాహుల్ ద్రావిడ్ సెంచరీ: పట్టుబిగిస్తున్న భారత్

FileFILE
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు‌లో భారత సీనియర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్ శతకం కొట్టాడు. గత కొంత కాలంగా ఫామ్‌లో లేక నానా తంటాలు పడుతూ వచ్చిన ద్రావిడ్.. ఎట్టకేలకు మొహాలీలో జరుగుతున్న టెస్టులో అద్భుతంగా రాణిస్తూ సెంచరీ సాధించాడు. గత మార్చి నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 'ది వాల్' శతకం సాధించాడు.

మొత్తం 261 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో కెరీర్‌లో 26వ సెంచరీని పూర్తి చేశాడు. అంతకుముందు తొలి రోజు ఓవర్ నైట్ స్కోరు 179/1తో రెండో రోజు ఉదయం ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత బ్యాట్స్‌మెన్స్ వికెట్‌ను సమర్పించుకోకుండా స్కోరు బోర్డును వేగంగా కదిలించారు.

తొలి రోజు సెంచరీ హీరో గౌతం గంభీర్, రెండో రోజు సెంచరీ ధీరుడు రాహుల్ ద్రావిడ్‌లు క్రీజ్‌లో పాతుకుని పోయి ఇంగ్లీష్ బౌలర్లను ముమ్మ తిప్పలు పెడుతున్నారు. వీరిద్దరు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆరు పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయిన భారత్.. మరో వికెట్ నష్టపోకుండా.. ద్రావిడ్-గంభీర్‌ల జోడి 257 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడీ ఇంకా క్రీజ్‌లో కొనసాగుతోంది.

వెబ్దునియా పై చదవండి