వెస్టిండీస్ దిగ్గజం లారాను అధిగమించిన రాహుల్ ద్రావిడ్..!

FILE
సెంచూరియన్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా సీనియర్ ఆటగాడు రాహుల్ ద్రావిడ్, వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా రికార్డును బ్రేక్ చేశాడు. బ్రియాన్ లారాకు చెందిన టెస్టుల్లో 11,953 పరుగుల రికార్డును రాహుల్ ద్రావిడ్ అధిగమించి, అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితాలో మూడో ఆటగాడిగా నిలిచాడు.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజైన గురువారం రాహుల్ ద్రావిడ్ కేవలం 11 పరుగులే చేయగలిగాడు. ఈ 11 పరుగుల ద్వారా 148 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ద్రావిడ్ 11,957 పరుగులతో బ్రియాన్ లారా రికార్డును అధిగమించాడు.

అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 175 టెస్టులాడి, 14,371 పరుగులతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

అలాగే ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ 151 టెస్టులాడి 12,332 పరుగుల స్కోరుతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక 131 టెస్టులాడిన బ్రియాన్ లారా 11,953 పరుగులతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి