పూర్తి వివరాలు చూస్తే... ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో 14 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ ఆమె సమీప బంధువులకు చెందిన యువకుడు వెంటబడ్డాడు. కొన్నిరోజులకు అతడిని నమ్మిన యువతి సన్నిహితంగా మెలిగింది. దాంతో అతడు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసాడు. ఫలితంగా ఆమె గర్భాన్ని దాల్చింది. దాంతో తనను పెళ్లాడాలంటూ అతడిని గట్టిగా నిలదీయగా ముఖం చాటేసాడు. తను మోసపోయానని తీవ్ర ఆవేదనకు గురైంది.
మోసగాడి ద్వారా పొందిన గర్భం తనకు వద్దంటూ కోర్టుకి ఫిర్యాదు చేసింది. అబార్షన చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరింది. ఆమె పిటీషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం, బాలిక అబార్షన్ చేయించుకునేందుకు అనుమతినిచ్చింది. బాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్య పర్యవేక్షణలో జరగాలని ఆదేశించింది.