హైదరాబాదులో దారుణం: పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు గ్యాంగ్ రేప్, వీడియో తీసి...
మంగళవారం, 29 నవంబరు 2022 (21:28 IST)
పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఐదుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాలూకు వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసారు. హైదరాబాదు లోని హయత్ నగర్ శివారు ప్రాంతంలో జరిగింది ఈ ఘటన.
ఆగస్టులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు, ఆ దారుణాన్ని వీడియో తీసారు. ఎవరికైనా చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తూ మరో పది రోజుల తర్వాత అఘాయిత్యం చేసారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిందితులు షేర్ చేసారు. విషయం బాధితురాలి తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా మైనర్లు కావడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది తెలియాల్సి వుంది.