ప్రేమను అంగీకరించలేదనీ యువతిపై పదునైన కత్తితో దాడి

సోమవారం, 26 సెప్టెంబరు 2022 (10:59 IST)
ఓ ప్రేమోన్మాది ఉన్మాద చర్యకు పాల్పడ్డాడు. ప్రేమను అంగీకరించలేదని యువతిపై ఓ యవకుడు పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో ఈ ఘటన జరిగింది. 
 
ఓయూ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌ భోలక్‌పూర్‌ బస్తీకి చెందిన యువతి(18) ఓ ప్రైవేటు మెడికల్‌ దుకాణంలో పనిచేస్తుంది. 
 
అదే బస్తీకి చెందిన రంజిత్‌(18) అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమె వెంటపడుతున్నాడు. మాట్లాడుకుందామని చెప్పి ఓయూలోని మానేరు వసతిగృహం వద్దకు శనివారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో తీసుకొచ్చాడు.
 
ఇద్దరి మధ్య మాటామాట పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో రంజిత్‌ ఆమెపై దాడి చేశాడు. దీంతో యువతి చేయికి తీవ్ర గాయమైంది. ఆమె గట్టిగా అరవడంతో రంజిత్‌ అక్కడి నుంచి పారిపోయాడు. 
 
స్థానికులు, పోలీసులు యువతిని కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. యువతి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు రమేష్‌నాయక్‌ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు