అందమైన ప్రేమజంట, ఆ ఒక్క మాటతో ఆత్మహత్య

బుధవారం, 27 అక్టోబరు 2021 (23:31 IST)
గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఇంట్లో పెద్దలను ఒప్పించారు. పెళ్ళి చేసుకుందామనుకున్నారు. యువకుడు ఉద్యోగం కోసం ప్రయత్నం ప్రారంభించాడు. ఉద్యోగం వచ్చిందే పెళ్ళి చేసుకుందామనుకున్నారు. అయితే ఇంతలో విషాదం నెలకొంది. ప్రేమ జంట ఆత్మహత్య పాల్పడింది.
 
శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం తునివాడకు చెందిన హరీష్, దివ్యలు గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పక్కపక్క ఇళ్లలో నివాసముండేవారు. ఇంట్లో వాళ్ళకి వీరి ప్రేమ విషయం తెలుసు. దీంతో వీరి ప్రేమను అంగీకరించారు పెద్దలు.
 
హరీష్ డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఉద్యోగం రాగానే పెళ్ళిచేస్తామని దివ్య తల్లిదండ్రులు తెలిపారు. దీంతో ఉద్యోగం కోసం రకరకాల ప్రయత్నం చేశాడు హరీష్. తన చదువుకు తగ్గట్లుగా కుటుంబాన్ని పోషించాల్సినంత జీతం ఉన్న ఉద్యోగం హరీష్‌కు దొరకలేదు. 
 
దీంతో హరీష్ ఎన్నిప్రయత్నాలు చేసినా ఉద్యోగం లేకుండా పోయింది. దీపావళి లోగానైనా ఉద్యోగం తెచ్చుకుంటే పెళ్ళి చేస్తామన్న కుటుంబ సభ్యులు. చివరకు ఉద్యోగం లేకపోవడంతో దివ్యకు వేరే పెళ్ళి చేసేందుకు సిద్థమయ్యారు. దీంతో హరీష్, దివ్యలు మనస్థాపానిక గురయ్యారు. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమజంట ఆత్మహత్యలతో కుటుంబంలో విషాదం నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు