రాష్ట్రంలోని ధోల్పుర్ జిల్లా బారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్‌పూర్‌లో ఈ నెల 26న సాయంత్రం బాధితురాలు.. కూరగాయలు కొనడానికి మార్కెట్కు వెళ్లింది. అదేసమయంలో ఓ యువకుడు.. తన బైక్పై బాలికను బలవంతంగా ఎక్కించుకుని బాసేడీ రోడ్డు టోల్ వద్ద వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఆరుగురు యువకులు.. ఆమెను కిడ్నాప్ చేసి ఓ ఇంటికి తీసుకెళ్లారు.