రంజిత్‌కు ఈ అవార్డు ఎలా వరించిందంటే.. 32 ఏళ్ల రంజిత్ ఉపాధ్యాయ వృత్తిని ఎంతో ఇష్టంతో చేపట్టారు. ఓ గోదాము, గోశాల మధ్య జీర్ణావస్థలో వున్న పాఠశాలను బాగు చేయించారు. పాఠాలను మాతృభాషలోకి తర్జుమా చేయించి పిల్లలకు బోధించారు. పిల్లలకు పాఠాలు బాగా అర్థమయ్యేలా ఆడియో, వీడియో, కథల రూపంలో తీర్చిదిద్ది, బాలలు పాఠశాలకు వచ్చేవిధంగా ప్రయత్నం చేసారు.
అంతేకాదు ఆయన పనిచేస్తున్న పాఠశాల పరిధిలో నూటికి నూరుశాతం బాలికలు చదువుకునేందుకు పాఠశాలకు వచ్చేవిధంగా ప్రయత్నించారు. బాల్యవివాహాలను నిరోధించారు. కులమతాలకు అతీతంగా విద్యార్థినివిద్యార్థులందరినీ తీర్చిదిద్దారు. పిల్లల్లో మేథోశక్తి పెంపెందించేందుకు ఎన్నో నూతన కార్యక్రమాలను చేపట్టారు. రంజిత్ వంటి ఉపాధ్యాయులు ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారుచేయగలరంటూ యునెస్కో అసిస్టెండ్ డైరెక్టర్ జనరల్ కొనియాడారు.