రాయలసీమలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లొల్లి!

ఆదివారం, 20 జులై 2014 (12:44 IST)
రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలన్న అంశంతో రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నారు సీమ నాయకులు. శ్రీబాగ్ ఓడంబడికను ముందుకు తెచ్చి రాయలసీమను రాజధాని చేయాలని లేదంటే ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కొందరు, రాయలసీమను సెకండ్ క్యాపిటల్‌గా చేసి అభివృద్ది పథంలో నడిపించాలంటూ మరి కొందరు. ఈ మూడు అంశాల మధ్య సీమ రాజకీయం అత్యంత నాటగకీయంగా సాగుతోంది. 
 
రాయలసీమ ప్రాంతం బ్రిటిష్ కాలం నుంచి వివక్షకు గురి అవుతున్న ప్రాంతమని, ఇక్కడ సహాజ వనరులు, ఖనిజ సంపదలు అపారంగా ఉన్నా దోపిడీకి గురవుతుందని ఇక్కడి మేధావుల అభిప్రాయం. ఇప్పటికీ రాయలసీమలో నీటి వినియోగం నాటి విజయనగర పాలనలో తవ్వించిన చెరువుల మీదే ఆధారపడి ఉంటుంది. కనీస సాగునీటి వసతులు లేక వర్షాభావం లేక అనంతపురంలాంటి జిల్లాలు అల్లాడి పోతున్నాయని వాపోతున్నారు. 
 
అందుకే రాయలసీయలో ఏదో ఒక జిల్లాను రాజధానిగానో లేక ఉపరాజధాని గానో ప్రకటించాల్న డిమాండ్ వస్తోంది. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్ర రాజధాని  కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మార్చడం మూలంగా రాయలసీయ తీవ్రంగా నష్టపోయిందని, ఆ తప్పును ఇప్పుడు సరిదిద్దాలని కోరుతున్నామని అంటున్నారు.
 
రాజధానిని ఎంపిక మీదా శివరామకృష్ణన్ కమిటి మూడు రోజుల పాటు కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో పర్యటించింది. ఈపర్యటన సందర్భంగా అనేక వాదనలు తెరమీదకొచ్చాయి. రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని కొంతమంది నేతలు డిమాండ్ చేయగా, మరికొంత అయితే వెనుకబడ్డ రాయలసీమ జిల్లాలలో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోనే రాజధాని ఏర్పాటు చేయాలని లేకపోతే ఉద్యమం తప్పదంటూ హెచ్చరించారు. 
 
సీమను రాజధానిగా చేయడానికి వీలు లేకపోతే కనీసం రాయలసీమకు నీటి సౌకర్యంతో పాటు కేంద్రం ప్రకటించిన 14 సంస్థలలలో జిల్లాకొక్కటి చొప్పున ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమ ఇప్పుడు సాగు జలాలు వంద టిఎంసిలు మాత్రమే వస్తున్నాయి. కానీ సమద్రంలో ప్రతి ఎడాది గోదావరి, కృష్ణ జలాలు 2000 టిఎంసిల వరకు కలసి పోతున్నాయి. అయితే జిల్లాకు వంద టిఎంసిల చొప్పున నాలుగు జిల్లాలకు నాలుగు వందల టిఎంసిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
దీనికితోడు ఇప్పుడు అభివృద్ధి చెందిన ప్రాంతాలు అయిన తిరుపతి, విజయవాడలలో ఎయిమ్స్,ఐఐటిలను అక్కడ కాకుండా అనంతపురం లాంటి వెనుక బడిన జిల్లాలో ఐఐటి, శ్రీకాకుళం, విజయనగరం లాంటి చోట ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని వీరు వాదన వినిపిస్తున్నారు. ఇవే కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
 
అయితే రాయసీమను రాజధానిగా చేయాలన్న డిమాండ్ ఈ నాటిది కాదు. 1983లో ఎన్.టి.ఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రాయలసీమ హక్కులు ఉద్యమం పేరుతో అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, మైసూర రెడ్డి, ఎంవి రమణారెడ్డి పాదయాత్రలు చేసి ప్రభుత్వం మీదా పోరాటం చేశారు. అయితే రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన జలయజ్ఞంలో భాగంగా హంద్రీనీవాతో పాటు పలు తాగునీటి పథకాలకు  చేపట్టారు. నాటి ప్రభుత్వంలో రాష్ట్రానికి  కేటాయించిన ఐఐటిని హైదరబాద్‌లోనూ, వెటర్నటీ యూనివర్సిటిని తిరుపతిలోనూ, అనంతపురం కేంద్రంగా జెఎన్‌టియును ప్రారంభించారు. 
 
రాష్ట విభజన సందర్భంగా కేంద్రం రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని బిల్లులో తెలిపింది. దాని గురించి ఇప్పటి వరకు ఎవ్వరు మాట్లాడలేదని అనంతపురం జిల్లా వాసులు మాత్రం తమ ప్రాంతంలో ఉప రాజధాని ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీ ముందు వాదన వినిపించారు. ఒక వర్గం రాజధాని కావాలని, మరో వర్గం ఉప రాజధాని కావాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీదా రాజధాని కావాలా వద్దా అన్న అంశంలోనే ఇప్పుడు సీమలో అభిప్రాయభేదాలు మొదలవుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి