రాజధానిపై ఇంత రగడ జరుగుతున్న సమయంలో టీడీపీకి చెందిన కీలక నేత, మాజీమంత్రి స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆ మాజీమంత్రి ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. ఆయనే టీడీపీకి చెందిన మాజీమంత్రి నారాయణ. గతంలో నారాయణ ఎమ్మెల్సీగా ఉన్నారు అయితే 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.
టీడీపీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం విషయంలో ప్రముఖ పాత్ర పోషించిన నారాయణ ప్రస్తుతం మౌనం వహిస్తుండడం ఏమిటో టీడీపీ శ్రేణులకు అంతుచిక్కడం లేదు. ఒకవేళ రాజధాని విషయమై తాను స్పందిస్తే, పాలక పక్షానికి ప్రత్యేకంగా టార్గెట్‌గా మారుతానని నారాయణ భావిస్తుండవచ్చు. ఈ ఉద్దేశ్యంతోనే ఆయన మౌనంగా ఉన్నారనే చర్చ నడుస్తోంది. ఏపీ నూతన రాజధాని అమరావతిపై మాజీమంత్రి నారాయణ స్పందన ఎలా ఉంటుందో సస్పెన్స్‌గా మారింది.