నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌కు మంచి ఫ్రెండ్. తన తమ్ముడైన జూనియర్ ఎన్టీఆర్ సినిమాల ఎంపిక విషయంలో కాదు.. అన్ని విషయాల్లోనూ మంచి సలహాదారుగా... అన్నయ్యగా కల్యాణ్ రామ్ ఉంటున్నాడని టాక్. గత రెండేళ్లుగా అన్నదమ్ములైన జూనియర్ ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్‌లు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ.. మంచి స్నేహితులుగా కనిపిస్తూ.. నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నారు.
ఎన్నికలకు తర్వాత ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేయడానికే కాదు.. నాయుడు ఆయన కుమారుడు లోకేష్‌లకు కూడా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్‌లతో సన్నిహితంగా ఉన్న కల్యాణ్ రామ్... ఎన్టీఆర్-చంద్రబాబు-నారాలోకేష్-బాలకృష్ణల మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
తద్వారా టీడీపీని పటిష్టం చేయడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్‌ను భవిష్యత్తులో ఏపీ సీఎం చేయొచ్చునని కల్యాణ్ రామ్ భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా నందమూరి వంశస్థుడైన జూనియర్ ఎన్టీఆర్‌కు సీఎం పదవి లభిస్తుందని.. తాత పోలికలున్న వ్యక్తే టీడీపీకి సారథి ఫలితాలు ఎంతో మెరుగ్గా ఉంటాయని కల్యాణ్ రామ్ భావిస్తున్నట్లు తెలిసింది.