ఈమధ్య కాలంలో అక్రమ సంబంధాలకు సంబంధించిన నేరాలు ఎక్కువయిపోతున్నాయి. ఆఖరికి బ్యూటీషియన్ శిరీషది కూడా దాదాపు ఇలాంటిదే. బతుకు తెరువు కోసం ఆఫీసు పనిలో చేరిన ఆమెను రాజీవ్ లోబరుచుకోవడం చివరికి ఆమె ఆత్మహత్యకు దారితీసింది. ఇలాంటివి మనిషి చనిపోయిన తర్వాతనో, లేదంటే ఏమయినా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఈ బయటపడుతున్నాయి.
ఐతే ఈ సంఖ్య మనదేశంలో తేడా వుండవచ్చు కానీ అక్రమ సంబంధాలు మాత్రం చాలావరకూ ఆఫీసు ఫ్రెండ్స్ తోనే సాగుతున్నట్లు తేలింది. ఇంటికంటే ఆఫీసులోనే ఎక్కువసేపు సమయాన్ని కేటాయించడంతో సహోద్యోగుల పట్ల చనువు పెరగడం, అది కాస్తా అక్రమ సంబంధాలకు దారితీయడం జరుగుతుందని తేలింది.