సినిమాలను పక్కన బెట్టేసిన పవన్ కల్యాణ్.. ఎన్నికలపైనే దృష్టి!?

శుక్రవారం, 10 నవంబరు 2023 (12:06 IST)
నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, పవన్ నాయకత్వంలోని జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తుతో ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. పవన్ ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో తలమునకలై ఉన్నారు. ఆ తర్వాత ఆయన తన కీలక రాజకీయ రణస్థలమైన ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారిస్తారు. 
 
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మార్చి లేదా ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగనుండటంతో.. ఎన్నికల కోసం అన్నీ సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితిలో వున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా సంబంధిత కార్యక్రమాలకు లేదా షూటింగ్‌లకు అందుబాటులో వుండట్లేదు.
 
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన షూటింగ్‌లో పాల్గొనరని తెలుస్తోంది. సినిమాని వేగంగా విడుదల చేసేందుకు రెండు వారాల సమయం ఇవ్వాలని ఓజీ దర్శకులు పవన్ కళ్యాణ్‌ను ఒప్పించాలనుకున్నప్పటికీ.. పవన్ సినిమాలను పక్కనబెట్టి రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి.
 
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీర మల్లు సినిమాల్లో నటిస్తున్నారు. ఓజీ షూటింగ్‌కి పవన్ కళ్యాణ్ సమయం 15 నుండి 20 రోజులు మాత్రమే అవసరమని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు