ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. గురువారం ఉదయం యూఎస్ గడ్డపై అడుగుపెట్టిన ఆయన శుక్రవారం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో సమావేశమయ్యారు. అలాగే, క్వాడ్, ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో పాల్గొననున్నారు. మొత్తంమీ తొలి రోజున రోజు చాలా బిజీగా గడిపారు.
ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌తోపాటు అమెరికాలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో వరుసగా భేటీ అయ్యారు. జో బైడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తొలిసారి అమెరికా వెళ్లిన మోడీ, శుక్రవారం ఆయనను కలవనున్నారు. అయితే అమెరికా పర్యటనలో భాగంగా మోదీ బస చేసిన హోటల్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
అమెరికా పర్యటనకు వచ్చే దేశాధినేతలు సాధారణంగా ఇదే హోటల్‌లో బస చేస్తుంటారు. దీంతో ఈ హోటల్ దగ్గర ఎప్పుడూ చాలా ఎక్కువ సంఖ్యలో భద్రతా బలగాలు ఉంటాయి. ముఖ్యంగా, దేశాధి నేతలు బస చేసే సమయాల్లో ఈ హోటల్ భద్రతా బలగాల వలయంలో ఉంటుంది.
ఈ హోటల్‌లో మొత్తం 9 సూట్లు ఉన్నాయి. వీటిలో కనీసం ఐదింట్లో దేశాధినేతలు వచ్చినప్పుడు బస చేస్తుంటారు. అబ్రహం లింకన్, జార్జ్ వాషింగ్టన్‌ల పేరు మీద కూడా ఇందులో సూట్లు ఉన్నాయి. ఈ హోటల్‌లో బుకింగ్స్ కొన్ని నెలల ముందుగానే చేసుకోవాలి. అమెరికా సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ హోటల్‌ను నిర్మించారు.
ఇప్పటివరకు ఎంతో మంది దేశాధినేతలు ఈ హోటల్‌లో బస చేసినప్పటికీ ఈ హోటల్ గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ బస చేయడంతో ఈ హోటల్ గురించి ఒక్కసారిగా నెటిజన్లు సెర్చ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ హోటల్ పేరు ఇపుడు మార్మోగిపోతోంది.