పన్నీర్ సెల్వం బెండయ్యారు... పళణిస్వామి ఏ పదవి ఇచ్చినా తీస్కుంటారట...

సోమవారం, 14 ఆగస్టు 2017 (15:55 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి రూటు మారుస్తున్నాడు. రెండువైపుల నుంచి తరుముకొస్తున్న ఆపద నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. తన పదవిని పదిలంగా కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే కేంద్రం సహకారం కోరిన పళణిస్వామి ప్రధాని మోదీ చెప్పినట్లుగానే వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
 
కొన్నిరోజుల క్రితం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన పళణిస్వామి మోడీని కలిశారు. దాంతో పాటు పన్నీరు సెల్వంకు తనకు మధ్య జరుగుతున్న చర్చలను వివరించారు. అలాగే దినకరన్ వల్ల ఏర్పడుతున్న సమస్యలను మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎలాగైనా మీరే నా పదవిని కాపాడాలి. అమ్మ జయలలిత ఆశయాలు, ప్రజా మేలు కోసం మీరు ఖచ్చితంగా నాకు సహకరించాలని కోరారట. ఇప్పటికే ఏ రాష్ట్రంలో అవకాశం దొరికితే ఆ రాష్ట్రాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటున్న మోదీకి మరో అవకాశం లభించింది.
 
సినీనటుడు రజినీకాంత్, కమలహాసన్ రాజకీయాల్లోకి వస్తున్నా, బిజెపిలోకి వస్తారా లేదా అన్నది అనుమానంగా మారింది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న పళణిస్వామికి సహకరిస్తే తమ కనుసన్నల్లోనే తమిళనాడు ప్రభుత్వం నడిచే అవకాశం ఉందన్న ఆలోచనలో మోదీ ఉన్నారట. అందుకే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారట. మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వంకు అన్ని విషయాలు చెప్పిన మోదీ పళణిస్వామి ఏ పదవి ఇచ్చినా స్వీకరించాలని, ఏదీ డిమాండ్ చేయవద్దని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో పన్నీరుసెల్వం కూడా పళణితో కలిసి ముందుకు నడిచేందుకు సిద్థమవుతున్నారు. ఇక మిగిలింది విలీనం మాత్రమే.

వెబ్దునియా పై చదవండి