తమిళనాడు ఎన్నికలకు మరో సంవత్సరం మాత్రమే ఉంది. దీంతో బిజెపి తమిళనాడులో పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది. ఏకంగా డిఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేను తనవైపు తిప్పేసుకుంది బిజెపి. తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే పార్టీ బలోపేతం అవుతున్న సమయంలో సీనియర్ ఎమ్మెల్యే సెల్వం బిజెపిలో చేరుతుండటం ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది.
వీరందరూ కూడా బిజెపిలో చేరేందుకు సిద్థమైపోతున్నారట. గత నాలుగు సంవత్సరాలుగా బిజెపిని అధికారంలోకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు అగ్రనేతలు. అయితే అది కాస్త ఫలించలేదు. ప్రస్తుతం డిఎంకే ఎమ్మెల్యే సెల్వంతో ఆపరేషన్ ప్రారంభించి మెల్లిగా మిగిలిన నేతలను తమ పార్టీలోకి తీసుకుని బలోపేతం చేయాలన్న ఆలోచనలో ఉన్నారట బిజెపి అగ్రనేతలు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ఆపరేషన్ లోటస్ వ్యవహారం కాస్త తీవ్ర చర్చకు దారితీస్తోంది.