విజయవాడ : పెట్రోల్ బంకుల వద్ద సెల్ఫోన్లు వాడకూడదనే హెచ్చరిక బోర్డులు మనకు కనిపిస్తుంటాయి. ఎందుకని సెల్ ఫోన్ మాట్లాడితే అంత పెద్ద ప్రమాదాలు జరుగుతాయా? ఫోన్ వల్ల పెట్రోల్ బంకుల్లో ప్రమాదాలు జరిగిన ఘటనలున్నాయా? ఒకటీ రెండు ప్రమాదాలు జరిగినా సెల్‌ఫోన్ ఎంతవరకు కారణమనేది స్ఫష్టత లేదు. అయితే చిన్న రాపిడికి సైతం మండే గుణం పెట్రోల్, డీజిల్‌కు ఉంటుంది. అందుకేనేమో పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఈ తరహా హెచ్చరికలు జారీ చేస్తుంటాయి.