2014లో వైసీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. అయితే అందులో భూమా అఖిల ప్రియ కూడా ఒకరు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళిన ఈమెకు టీడీపీలో మంత్రి పదవి కూడా లభించింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల ఉప ఎన్నికలలో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని టీడీపీ తరపున పోటీ చేయించి గెలిపించుకున్నారు.
అయితే ఈ సారి జరిగిన ఎన్నికలలో మాత్రం వీరిద్దరు ఓడిపోయారు. ఇక టీడీపీకి కూడా అధికారం లేకపోవడంతో.. ఇక వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు అఖిల. ఇందుకోసం తెరవెనుక మంతనాలు కూడా సాగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే వీరి కుటుంబంతో ఎప్పటి నుంచో సాన్నిహిత్యంగా ఉన్న వైఎస్ విజయమ్మ ద్వారా వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భూమా అఖిలప్రియ ఆలోచిస్తున్నారట.
అయితే తాను టీడీపీలో ఉన్నప్పుడు కానీ, మంత్రిగా ఉన్నప్ప్పుడు కానీ జగన్‌పై ఎలాంటి ఆరోపనలు చేయలేదని కూడా చెప్పారట. దీంతో మళ్ళీ భూమా కుటుంబం వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అందుకు జగన్ కూడా సానుకూలంగా వున్నట్లు వార్తలు వస్తున్నాయి.